telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రంగంలోకి కేసీఆర్‌.. గ్రేటర్‌ ఎన్నికలపై ఇవాళ కీలక చర్చ

Kcr telangana cm

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్‌ నిన్ననే రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఇవాళ్టి నుంచి నామినేషన్లు కూడా ప్రారంభంకానున్నాయి. డిసెంబర్ 1న గ్రేటర్‌ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే.. ఈ ఎన్నికలు టీఆర్‌ఎస్‌ పార్టీకి పెద్ద సవాలుగా మారాయి. దీంతో.. దుబ్బాక ఓటమి తర్వాత..టీఆర్‌ఎస్‌కు ఇదే మొదటి ఎన్నిక. గ్రేటర్‌ ఎన్నికలను అన్ని తానై కేటీఆర్‌ టీఆర్‌ఎస్‌ను ముందుకు తీసుకుపోతున్నాడు. కేటీఆర్‌ ఉన్నప్పటికీ.. ఈ ఎన్నికల్లో మరింత కసిగా పనిచేయాలని గులాబీ బాస్‌ అనుకుంటున్నారని సమాచారం. అందుకే ప్రతిపక్షాలకు ఛాన్స్‌ ఇవ్వకుండా.. స్వయంగా సీఎం కేసీఆరే ఈ ఎన్నికల్లో రంగంలోకి దిగి.. వ్యూహాలు రచించనున్నారు. ఇందులో భాగంగానే టీఆర్ఎస్ పార్లమంటరీ పార్టీ, లెజిస్లేచర్ పార్టీ సమావేశం ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో సీఎం కెసిఆర్ అధ్యక్షతన జరుగనుంది. పార్టీ లోక్ సభ, రాజ్యసభ సభ్యులను, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలను ఈ సమావేశంలో విధిగా హాజరు కావాలని సీఎం కెసిఆర్ కోరారు. మంత్రులు తమ జిల్లాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీ లను సమన్వయం చేసుకుని సమావేశానికి తీసుకురావాలని కోరారు.

Related posts