telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

నేడు ప్రపంచ కప్ లో .. ఆఫ్ఘన్ తో తలపడనున్న భారత్..

today afghanistan vs India in world cup match

ప్రపంచకప్‌లో భాగంగా నేడు భారత్-ఆఫ్గనిస్తాన్ తో తలపడనుంది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఆఫ్ఘనిస్థాన్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. రోస్‌బౌల్ స్టేడియంలో బలమైన భారత బ్యాటింగ్‌కు.. ఆఫ్ఘనిస్థాన్ స్పిన్ త్రయానికి మధ్య పోరు జరుగనుంది. ఏ జట్టును తేలిగ్గా తీసుకోం. ఆస్ట్రేలియా అయినా, ఆఫ్ఘనిస్థాన్ అయినా మా పోరాటంలో మార్పు ఉండదుఅన్న కోహ్లీ మాటలను బట్టిచూస్తే.. తుది జట్టులో పెద్దగా మార్పులు ఉండవని అనిపిస్తున్నది.

గాయం కారణంగా దూరమైన పేసర్ భువనేశ్వర్ స్థానంలో షమీ ఈ టోర్నీలో తొలి మ్యాచ్ ఆడనుండగా.. ప్రాక్టీస్ సమయంలో గాయపడ్డ శంకర్ పూర్తిగా కోలుకున్నట్లే కనిపిస్తున్నాడు. ఒకవేళ మ్యాచ్‌కు ముందు శంకర్ ఇబ్బందిగా కనిపిస్తే.. రిషబ్ పంత్‌కు అవకాశం దక్కొచ్చు. ఇప్పటికే మెగాటోర్నీలో సగం మ్యాచ్‌లు పూర్తైన తరుణంలో.. చిన్న జట్లతో మ్యాచ్‌లను ఫేవరెట్‌లు రన్‌రేట్ మెరుగుపరుచుకునేందుకు వాడుకుంటున్నాయి. అదే కోవలో మనవాళ్లు టాస్ గెలిస్తే మొదట భారీ స్కోరు చేసి రన్‌రేట్ పెంచుకోవాలనే భావనలో ఉన్నారు. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమ్‌ఇండియాను అడ్డుకోవాలంటే ఆఫ్ఘన్ శక్తికి మించి శ్రమించక తప్పదు.

Related posts