నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వర్కింగ్ టైటిల్ “బిబి-3” పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన బీబీ 3 టీజర్‌కి మాస్ ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్, కరోనా కారణంగా వాయిదా పడగా, త్వరలోనే తిరిగి సినిమా షూటింగ్ ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే వారణాసిలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ నెల 15 నుంచి బాలయ్య ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నారట. ఈ భారీ సినిమాకు సంబంధించి క్రేజీ అప్‌డేట్ బయటకొచ్చింది. ఈ సినిమాలో బాలయ్య సరసన నటించబోతున్న హీరోయిన్ విషయంలో క్లారిటీ వచ్చేసింది. గత కొన్ని నెలలుగా బోయపాటి శ్రీను- బాలయ్య కాంబోలో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గురించి చర్చలు నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో హీరోయిన్ తెరపైకి వచ్చింది. బాలకృష్ణ సరసన హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ ఖరారైంది. ఇవాళ ఆమె బాలయ్యతో కలిసి రామోజీ ఫిలిం సిటీలోని సెట్‌లోకి అడుగుపెట్టనున్నారు. వీరిద్దరిపై కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో సాయేషా, పూర్ణలు నటిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్ “కంచె” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. బోయపాటి-బాలయ్య కాంబోలో మూడోసారి వచ్చే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
previous post
లవ్ ఫెయిల్యూర్ గురించి స్పందించిన నయనతార…