telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సిద్ శ్రీరామ్ పాడిన ‘మనసా మనసా’ సాంగ్ రిలీజ్

sriram

సిద్ శ్రీరామ్ ప్రస్తుతం సౌత్‌లో పాపులర్ సింగర్. అంతలా ఆయన తన స్వరంతో మాయ చేస్తున్నారు. ఆయన అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో సినిమాలో పాట పాడినా.. ప్రదీప్ మాచిరాజు వంటి చిన్న హీరో చిత్రంలో పాట పాడినా పాపులారిటీ మాత్రం ఒకేలా ఉంటుంది. అదీ సిద్ శ్రీరామ్ మాయ. అయితే, ఇప్పుడు మరో అందమైన పాటతో సిద్ శ్రీరామ్ మన ముందుకు వచ్చారు. అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రంలో ‘మనసా మనసా’ అనే పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. గోపీ సుందర్ స్వరపరిచిన ఈ పాటను మార్చి 2న విడుదల చేశారు. ఈ సినిమా నుంచి వస్తోన్న తొలిపాట కావడంతో బజ్ ఏర్పడింది. అయితే, ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించడంతో ఆ బజ్ మరింత పెరిగిపోయింది. సిద్ శ్రీరామ్ ఈ పాటను తన స్టైల్లోనే అద్భుతంగా ఆలపించారు.

Related posts