telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రేపు తెలంగాణ కేబినెట్ అత్యవసర భేటీ

రేపు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ అత్యవసర భేటీ కానుంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన, శనివారం (రేపు) మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ అత్యవసర భేటీ కానున్నది. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో కరోనా , లాక్ డౌన్, వర్షపాతం, వానాకాలం సాగు, వ్యవసాయం సంబంధిత సీజనల్ అంశాలు, గోదావరిలో నీటిని లిఫ్టు చేసే అంశం, హైడల్ పవర్ ఉత్పత్తి.. తదితర అంశాల పై కేబినెట్ చర్చించనున్నది. తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో లాక్ డౌన్ ఎత్తివేయాలని యోచిస్తోన్నట్లు సమాచారం. కాగా తెలంగాణ‌లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్ర‌మంగా త‌గ్గుతూ వస్తోంది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1417 కరోనా కేసులు, 12 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 610834 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక ఈరోజు కరోనా నుంచి కోలుకున్న వారు 1897 మంది కాగా.. ఇప్పటివరకు మొత్తం 586362 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కరోనాతో 3546 మంది మృతి చెందగా.. రాష్ట్రంలో ప్రస్తుతం 19029 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 124430 మందికి కరోనా పరీక్షలు చేయడంతో.. ఇప్పటివరకు మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 1,73,14,780 కు చేరింది. ఇక ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ లో 149 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

Related posts