telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

జాతీయ జెండా

Indian flag

నా దేశ జెండా..!!

మన జాతి గౌరవం ఈ జెండా..!!

అమరవీరుల త్యాగ నిదర్శనం ఈ జండా..!!

శతాబ్దాల ఘన చరిత్ర ఈ జెండా..!!

 

హిమగిరి లపై నిలిచిన భారతదేశ ఖ్యాతి ఈ జెండా..!!

ఎర్రకోటపై వీరవిహారం విహరించే ఈ జెండా..!!

శాంతి.. సత్యాగ్రహాల ఫలిత నిదర్శనం ఈ జెండా..!!

గగన సీమలకు ఘనకీర్తిని చాటినది ఈ జెండా..!!

 

సమరశంఖ నినాదాలకు సాక్షి భూతం ఈ జెండా..!!

ఎందరో అమరవీరుల అమృత భావాల ఊపిరే ఈ జెండా..!!

సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని క్విట్ ఇండియా పేరుతో వెన్ను చూపి పరిగెత్తించింది ఈ జెండా..!!

తరతరాలు మారిన నీ చరిత్ర మారునా ఘన చరితకే విజయ చరితం మన భారత దేశ జెండా..!!

ప్రపంచ దేశాలకు గర్వకారణం

మన జాతీయజెండా.

 

వందేమాతరం, వందేమాతరం, వందేమాతరం, వంద వత్సరాలు కీర్తి గాంచిన ఈ జెండా..!!

నా భారతదేశ జెండా..!!

నా జాతి ఖ్యాతి ఈ జెండా..!!

మన ఊపిరి జెండా..!!

మన విజయం ఈ జెండా..!!

 

 

Related posts