telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

కాబోయే భర్తతో చనువుగా ఉండొద్దన్న తండ్రి.. ఆత్మహత్య చేసుకున్న కూతురు

Crime

కాబోయే భర్తతో చనువుగా ఉండొద్దని కూతురును ఓ తండ్రి హెచ్చరించాడు. దీంతో మనస్తాపం చెందిన కూతురు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం గుంటూరు జిల్లాకు చెందిన కుంచల శివారెడ్డి తన కుటుంబంతో కలిసి మౌలాలి సమీపంలోని జవహర్ నగర్ లో నివాసం ఉంటున్నాడు. అతను, తన కుమార్తె కవిత (20)కు ఇటీవల మేనబావ కృష్ణారెడ్డితో వివాహాన్ని నిశ్చయించి, ఎంగేజ్ మెంట్ ను జరిపించాడు.

రెండు వారాల క్రితం కృష్ణా రెడ్డి, శివారెడ్డి ఇంటికి రాగా, కవిత అతనితో చనువుగా ఉంది. దాన్ని గమనించిన శివారెడ్డి, కుమార్తెను వారించి, పెళ్లి ముందు సన్నిహితంగా ఉండవద్దని హెచ్చరించాడు. దీంతో కవిత మనస్తాపానికి గురైంది. శుక్రవారం నాడు పురుగుల మందు సేవించింది. విషయాన్ని గమనించిన కుటుంబీకులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయినప్పటికీ ఫలితం దక్కలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.

Related posts