ముఖ్యమంత్రి కేసిఆర్ నిర్లక్ష్యం వల్లే తెలంగాణ రైల్వే ప్రాజెక్టుల్లో అభివృద్ది ఉండడం లేదని ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు పలు విమర్శలు చేశారు. ఇందులో దక్షిణమధ్య రైల్వే జీఎంతో సమావేశమైన కేంద్రమంత్రి కిషన్ రెడ్డితోపాటు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిలు సీఎం కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు. ప్రాజెక్టుల అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని కేంద్ర హోంశాఖ సహయమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. దక్షిణమధ్య రైల్వే జీఎంతో భేటి అనంతరం ఆయన పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్‌ను అధిగమించేందుకు చర్లపల్లిలో 150 ఎకరాల్లో నిర్మించ తలపెట్టిన రైల్వే టెర్మినల్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం స్థలాన్ని కేటాయించడం లేదని చెప్పారు. దీంతో కేవలం 50 ఎకరాల విస్తీర్ణంలోనే టెర్మినల్ ఏర్పాటు జరగుతుందని ఆయన వివరించారు.
ఇందుకోసం రైల్వేశాఖ 81 కోట్ల రుపాయలను కేటాయించిందని చెప్పారు.ఇక కాంగ్రెస్ ప్రభుత్వ హాయంతో పోల్చుకుంటే బీజేపీ ప్రభుత్వ హయాంలోనే దక్షిణమధ్య రైల్వేకు ఎక్కువ నిధులు కేటాయించామని ఆయన తెలిపారు. ఎంపీ రేవంత్ రెడ్డి సైతం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో రైల్వేల అభివృద్దిక ఆటంకం కల్గుతుందని ఆయన ఆరోపించారు. ఉందానగర్ నుండి శంషాబాద్ విమానాశ్రయం వరకు ఎంఎంటీఎస్ నిర్మాణానికి రూ.400 నుండి రూ. 500 కోట్లు వెచ్చిస్తే సరిపోతుందని…అలాంటీ ప్రాజెక్టు రాష్ట ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపణలు చేశారు. రూ.25వేల కోట్లతో గచ్చిబౌలి నుండి శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో నిర్మాణం చేపట్టేందుకే ఈ పనులను పక్కన పెట్టిందని ఆయన విమర్శించారు.
కశ్మీర్ అమ్మాయిలకు లైన్ క్లియర్.. హరియాన సీఎం అనుచిత వ్యాఖ్యలు