telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

ఆడవారికి మీసాలా.. దీనితో సరి.. !

natural remedies for unwanted hair

అవాంఛిత రోమాలతో చాలా మంది బాధపడుతూనే ఉంటారు. కొందరికి ముఖంపైనే ఈ సమస్య ఉండటం ఇంకా బాధకలిగిస్తుంది. కనీసం విల్లు బయటకు కూడా రావడానికి ఇబ్బంది పడుతుంటారు. రోజు షేవ్ లాంటివి చేయలేరు కాబట్టి, ఈ సమస్యకు ఎన్నో చిట్కాలు పాటించి, అవి వికటించి సమస్య ఇంకా పెద్దది చేసుకున్న వాళ్ళూ లేకపోలేదు. అయితే కొందరికి, ముఖ్యంగా మహిళలకు మగవారికి వచ్చినట్టుగా మీసాలు వచ్చేస్తుంటాయి. ఈ సమస్యను తొలగించటానికి అనేక సహజసిద్ధమైన పదార్ధాలు ఉన్నాయి. వాక్సింగ్, త్రేడింగ్ వంటి పద్దతులను ఉపయోగిస్తే కొంచెం నొప్పి కలగటమే కాకుండా కాస్త అసహ్యంగా కూడా కనిపించే అవకాశం ఉంది.

ఈ అవాంఛిత రోమాలు తొలగించటానికి సహజసిద్ధమైన మార్గాలు : 
ఈ పద్ధతులు సురక్షితమైన, సులువైన, నొప్పి లేకుండా ఉండే సహజసిద్ధమైనవి.

natural remedies for unwanted hair* కోడిగుడ్డు తెల్లసొనను పై పెదవిపై పొరల వేయాలి. 15 నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో ఒకసారి క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

* ఒక స్పూన్ నిమ్మరసంలో ఒక స్పూన్ పంచదార కలిపి పై పెదవిపై రాసి 20 నిమిషం తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత రోజ్ వాటర్ రాయాలి. వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.

* ఒక స్పూన్ బంగాళాదుంప రసంలో అరస్పూన్ మైదా పిండిని కలిపి జుట్టు పైపెదవిపై రాసి 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.

* రెండు స్పూన్ల పాలలో పావు స్పూన్ పసుపు కలిపి ముఖానికి రాసి పది నిమిషం తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా వారానికి రెండు సార్లు చేస్తే పైపెదవిపై జుట్టు తొలగిపోతుంది.

Related posts