telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

జనవరి 8న .. గ్రామీణ భారత్ బంద్ .. రుణవిమోచన చట్ట డిమాండ్..

pension to farmers in kerala

దేశానికి వెన్నెముక లాంటి రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు రుణవిమోచన చట్టం తేవాలంటూ 2020 జనవరి 8వ తేదీన గ్రామీణ భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని అఖిల భారత రైతు సంఘాల పోరాట సమితి పిలుపునిచ్చింది. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రైతు సంఘాల సమావేశం జరిగింది.

మాజీ ప్రధాని చరణ్‌సింగ్ జయంతిని పురస్కరించుకుని వ్యవసాయం, అనుబంధ రంగాల్లో విశేష కృషి చేసిన ఐదుగురికి ఈ నెల 23న కర్షక సాధికార సంఘటన అవార్డులను ప్రదానం చేయనుంది. రైతులు పిడికిటి చంద్రశేఖర్ ఆజాద్, మహిళా రైతు అన్నె పద్మావతి, సాక్షి పత్రిక వ్యవసాయ బ్యూరో ఇంచార్జి పంతంగి రాంబాబు, టీన్యూస్ చేను.. చెలక ఎడిటర్ విద్యాసాగర్, రాజేంద్రనగర్ పరిశోధన కేంద్రం ప్రిన్సిపల్ సైంటిస్టు దామోదరరాజుకు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అవార్డులను అందజేస్తారు.

Related posts