telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హాలీవుడ్ రీమేక్ కు దీపికా గ్రీన్ సిగ్నల్

Deepika-Padukone

బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకొణే “ప‌ద్మావ‌త్‌” తరువాత చాలా రోజులకు “ఛపాక్” అనే చిత్రంలో చేసింది. ఇటీవ‌ల విడుద‌లైన “ఛ‌పాక్” చిత్రం దీపికాకి మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే ఇప్పుడు తాను హాలీవుడ్ రీమేక్‌తో బిజీ కానున్న‌ట్టు ట్విట్ట‌ర్ ద్వారా పేర్కొంది దీపిక. “ద ఇంట‌ర్న్” అనే హాలీవుడ్ చిత్రానికి ఇది రీమేక్ అని దీపిక తెలిపింది. హాలీవుడ్‌ చిత్రంలో రోబర్ట్‌ డీ నీరో, అన్నే హథవే ముఖ్య పాత్రల్లో నటించారు. హిందీలో ఈ పాత్రలను రిషీ కపూర్, దీపికా పదుకోన్‌ చేయనున్నారు. రిషీ కపూర్‌ కంపెనీలో ఇంటర్న్‌గా పని చేసే బాస్ లేడీగా దీపిక నటిస్తారట. హాలీవుడ్‌ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ వార్నర్‌ బ్రదర్స్‌తో కలిసి దీపికా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. అన్నీ కుదిరితే వచ్చే ఏడాదిలో ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. చిత్ర ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌నేది త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నారు. “ట్రిపుల్ ఎక్స్” అనే చిత్రంతో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే.

Related posts