telugu navyamedia
ఆరోగ్యం

స్కిన్ అలర్జీకి చక్కటి చిట్కా

skin

సాధారణంగా మనం అరటి పండుని తిని తొక్కని పడేస్తుంటాం. కేవలం పండులోనే కాదు.. తొక్కలో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో ఎక్కువగా విటమిన్లు, ఖనిజాలు, బి6, బీ 12, ఏ, సి విటమిన్స్, మాంగనీస్, పొటాషియం, పీచుపదార్థాలు, ప్రోటీన్స్, మెగ్నీషియంలు ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మానికి కూడా మేలు చేస్తాయి. స్కిన్ అలర్జీతో ఇబ్బంది పడుతుంటే అరటి తొక్కతో ఆ ప్రాంతంలో రుద్దండి. తొక్కలో ఉన్న స్ట్రాంగ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అలెర్జీ సమస్యలను దూరం చేస్తాయి. ఇలా చేయడం వల్ల దద్దుర్ల సైజ్, మంట, వాపు, నొప్పి వంటి సమస్యలు దూరం అవ్వడమే కాకుండా ఆ ప్రాంతం కూల్‌గా మారుతుంది. ఇది కేవలం అలెర్జీ ఉన్నప్పుడు మాత్రమే కాదు.. దోమలు కుట్టినప్పుడు కూడా ట్రై చేయొచ్చు. ఇదే కాకుండా అరటి తొక్కపై కాస్తా గ్లిజరిన్ రాసి ఆ తొక్కతో సమస్య ఉన్న ప్రాంతంలో సున్నితంగా మర్దనా చేయండి. ఇలా చేస్తుంటే క్రమంగా సమస్య తగ్గుతుంది. పైగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సో, ఈ చిట్కాలను ఎవరైనా ట్రై చేయొచ్చు.

Related posts