telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఛార్మి 9 నెలల కొడుకుతో డార్లింగ్ ప్రభాస్… పిక్ వైరల్

Prabhas

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం హైదరాబాద్ వచ్చిన విషయం చాలా మందికి తెలియదు. ఇటీవలే ప్రభాస్ “రాధే శ్యామ్” ఇటలీ షెడ్యూల్ పూర్తి చేసుకుని హైదరాబాద్ వచ్చారు. అయితే తాజాగా ఛార్మి చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ప్రభాస్ హైదరాబాద్‌లోనే ఉన్న విషయం అందరికీ తెలిసింది. ఛార్మి వద్ద పెంపుడు శునకం ఉన్న సంగతి తెలిసిందే. అలస్కన్ మలమ్యూట్ జాతికి చెందిన ఆ శునకం చూడటానికి సింహంలా ఉంటుంది. ప్రస్తుతం ఛార్మి దగ్గర ఉన్న ఆ శునకం వయసు 9 నెలలు. ఈ శునకాన్ని ఛార్మి సొంత కొడుకులా చూసుకుంటుంది. ఆ శునకంతో ప్రభాస్ కూర్చున్న ఫొటోను ఛార్మి సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ‘‘నా 9 నెలల కొడుకుతో డార్లింగ్’’ అని క్యాప్షన్ పెట్టారు. మరి పూరి ఆఫీస్‌కు ప్రభాస్ ఎందుకెళ్లారో తెలియదు కానీ.. ప్రస్తుతం ఛార్మి పోస్ట్ వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే పూరితో కలిసి ఛార్మి సొంతంగా సినిమాలు నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. పూరీ జగన్నాథ్ టాకీస్, పూరి కనెక్ట్స్ నిర్మాణ సంస్థలను ఛార్మి లీడ్ చేస్తున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’తో భారీగా లాభాలను అర్జించిన ఛార్మి… ఇప్పుడు ‘రొమాంటిక్’, ‘ఫైటర్’ చిత్రాలను సిద్ధం చేస్తున్నారు. ఇక ప్రభాస్ రాధేశ్యామ్, ఆదిపురుష్ లాంటి పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Related posts