telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆకాశం నీ హద్దురా : “సఖియే” లిరికల్ వీడియో సాంగ్

ANH

తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ‘సూరరై పోట్రు’ తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో విడుదల కానుంది. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జీఆర్ గోపీనాథ్ జీవితాధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకురాలు సుధ కొంగర. ఆస్కార్ అవార్డు గ్రహీత గునీత్ మోంగాతో పాటు సూర్య ఈ సినిమాను నిర్మాతగా వ్యవహరించారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ వినోద్ మాల్యా అనే పాత్రలో నటించారు. ఈ సినిమాలో జేబులో ఆరు వేల రూపాయలు పెట్టుకుని పట్టణం వచ్చిన వ్యక్తి విమాన కంపెనీని ఎలా స్థాపించాడు? ఆ సమయంలో ఆయన ఎదుర్కొన్న సవాళ్లు ఇందులో చూపించనున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. ఈ సినిమాలో విలక్షణ నటుడు మోహన్‌బాబు ముఖ్యపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు విడుదల చేసిన ట్రైలర్, సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి “సఖియే” అనే లిరికల్ వీడియో సాంగ్ (హ్యాపీ) వెర్షన్ ను విడుదల చేశారు. ఈ సాంగ్ ప్రేమికులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. మీరు కూడా ఈ సాంగ్ ను వీక్షించండి.

Related posts