మహారాష్ట్రలోని వాకడ్‌కు సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన వారంతా తెగ ఆశ్యర్యపోతున్నారు. ఆ వీడియోలో ఉన్నదాని ప్రకారం ఒక యువతి ఆలయం వెలుపల స్కూటర్‌పై కూర్చుంది. దర్శనం పూర్తయ్యాక దండం పెట్టుకుని వెళ్లేందుకు సిద్ధమవుతూ ఎక్సిలేటర్‌ను వేగంగా తిప్పింది. దీంతో ఆ స్కూటర్ నేరుగా ఆలయంలోనికి ప్రవేశించి నంది వద్ద పడిపోయింది. ఈ ఘటనలో ఆమె కూడా నంది చరణాల వద్ద పడిపోయింది. వైరల్‌గా మారిన ఈ వీడియోను చూసినవారంతా… ‘బయటి నుంచి మొక్కుబడిగా దండం పెట్టుకుంటున్న భక్తురాలిని భగవంతుడు ఆలయం లోనికి రప్పించుకున్నాడంటూ’ కామెంట్ చేస్తున్నారు.
previous post