telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

జ్వరం వచ్చినప్పుడు.. నాన్ వెజ్ తింటే.. ఏమవుతుందో తెలుసా..!

non veg on fever will dangerous to liver

ఒంట్లో నలతగా ఉంటె, తేలికపాటి ఆహారం తీసుకోవాలని పెద్దల నుండి వైద్యుల వరకు సూచిస్తునే ఉంటారు. అయినా కొన్ని సందేహాలు బుర్రను తొలిచేస్తూనే ఉంటాయి. వాటికి సరైన సమాధానం తెలుసుకొని తీరాలి. ఉదాహరణకు జ్వరం వచ్చిన చాలా మందికి తలెత్తే ఒక సందేహం ఒకటి ఉంటుంది. అదేమంటే, జ్వరం వచ్చినప్పుడు మాంసాహారం తినవచ్చా.. ? చికెన్‌, మటన్‌, చేపలు, కోడిగుడ్లు వంటి నాన్ వెజ్ వంటకాలను తినకూడదా .? తింటే ఏమవుతుంది ? అనే సందేహం చాలా మందికి వస్తుంది. అయితే కొందరు తింటారు, ఇంకొందరు భయానికి తినరు.

అసలు జ్వరం వచ్చినప్పుడు నాన్‌వెజ్ తింటే ఏమవుతుంది అనేదానికి చాలా మందికి తెలిసిన సమాధానం .. పచ్చ కామెర్లు వస్తాయని. మరి అదే నిజామా.. ఇంకేమైనా కారణాలు తెలుసుకుందాం.

* నిజానికి శరీరంలో ప్రతి క్షణం మంచి చెడు మధ్య యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అందులో మంచి క్రిములు గెలిస్తే, ఆరోగ్యం, చెడు క్రిములు గెలిస్తే ఏదో ఒక నలతగా అనిపిస్తుంది. అదేవిధంగా జ్వరం వస్తే జీర్ణశక్తి బాగా తగ్గిపోతుంది. అందుకే డాక్టర్లు తేలిగ్గా అరిగే ఆహారం తీసుకోమంటారు. అలాంటప్పుడు సరిగ్గా జీర్ణం కాని మాంసాహారం తింటే దానితో లివర్‌పై లోడ్ ఎక్కువగా పెరిగిపోతుంది. మరి అప్పుడు లివర్ పనితీరు మందగిస్తుంది.

* లివర్ ఆరోగ్యంగా లేకుంటే వెంటనే వచ్చే సమస్య, పచ్చకామెర్లు. కనుక జ్వరం వచ్చినప్పుడు మాంసాహారం అస్సలు తినరాదు అంటుంటారు. తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం మాత్రమే తింటే మంచిదని సూచిస్తారు.

tips to save liver healthy even drunk* నిజానికి జ్వరంలో ఉన్నప్పుడు నాన్ వెజ్ తినడం వల్ల మాత్రమే కాదు, పలు ఇతర కారణాల వల్ల, కొందరికి పచ్చ కామెర్లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అది ఎలా అంటే, ఎక్కువగా హోటల్స్‌లో భోజనం చేసే వారు, బయట దొరికే ఆయిల్ ఫుడ్స్‌, చిరు తిండ్లు తినేవారికి, ఇంట్లో అయినా ఆయిల్ ఫుడ్స్‌, నాన్ వెజ్ వంటకాలు బాగా తినే వారికి, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగేవారికి పచ్చకామెర్లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. బాగా మద్యం సేవించే వారికి కూడా పచ్చ కామెర్లు రావచ్చు. ఎందుకంటే ఈ పనులు చేస్తే లివర్ ఒత్తిడికి గురవుతుంది. లివర్ పనితీరు మందగించి కామెర్లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.

Related posts