telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తమన్ ని ఫాలో అవుతున్న పవన్

pavan

పవన్ కల్యాణ్‌ని ట్విట్టర్‌లో 39 లక్షలమంది ఫాలో అవుతున్నారు. అయితే ఆయన మాత్రం కేవలం 33మందిని మాత్రమే ట్విట్టర్‌లో ఫాలో అవుతున్నాడు. అందులో సినీ ఇండస్ట్రీకి చెందిన వారు చాలా తక్కువమంది ఉన్నారు. ఇటీవలే సోషల్ మీడియాలో చేరిన తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవితో పాటు, రామ్ చరణ్, సాయిధరమ్ తేజ్, బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌ను పవన్ ఫాలో అవుతున్నారు. మిగతా వాళ్లంతా రాజకీయ ప్రముఖ నాయకులే ఉన్నారు. ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింత్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా , నిర్మల సీతారామన్, తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో పాటు మరికొందరు ప్రముఖుల్ని పవన్ ఫాలో అవుతున్నారు. అయితే తాజాగా పవన్ లిస్టులో ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ చేరాడు. పవన్ లేటెస్ట్‌గా తమన్‌ను ట్విట్టర్‌లో ఫాలో అవ్వడం ప్రారంభించారు. ఈ విషయాన్ని స్వయంగా తమన్ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. 

Related posts