telugu navyamedia
సినిమా వార్తలు

వేణు మాధవ్ సినీ కెరీర్…!

Venu

ప్రముఖ కమెడియన్ వేణు మాధవ్ కొద్ది సేప‌టి క్రితం క‌న్నుమూశారు. సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు కిడ్నీ సమస్యలు కూడా రావడంతో కుటుంబ సభ్యులు ఇటీవలే ఆస్పత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ ఆయన బుధవారం మృతి చెందారు. దీంతో టాలీవుడ్ ప్ర‌ముఖులు సంతాపం ప్ర‌క‌టించారు. వెండితెర‌పైనే కాదు బుల్లితెర‌పై కూడా ఆయ‌న రాణించారు. ప‌లు కార్య‌క్ర‌మాల‌కి ఆయ‌న యాంక‌ర్‌గా కూడా ప‌ని చేశారు. రాజ‌కీయాల‌లోను చురుకుగా ప‌ని చేవారు. దాదాపు 600కి పైగా సినిమాల‌లో నటించిన వేణు మాధవ్ హంగామా, భూ కైలాస్ చిత్రాల‌లో హీరోగా చేశారు. ఆయ‌న‌కి భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. అనారోగ్య కార‌ణాల వ‌ల‌న ఐదేళ్లుగా సినిమాల‌కి దూరంగా ఉన్నారు వేణు మాధ‌వ్. చివ‌రిగా రుద్ర‌మ‌దేవి చిత్రంలో కనిపించారు

వేణు మాధ‌వ్ సినీ రంగంలోకి ప్ర‌వేశించ‌క ముందు హిమాయ‌త్ న‌గ‌ర్‌లోని తెలుగు దేశం పార్టీ కార్యాల‌యంలో టెలిఫోన్ ఆప‌రేట‌ర్‌గా ప‌నిచేశారు. ఆ స‌మ‌యంలో ఆఫీసు ఫోన్‌కి ఎక్కువ‌గా వేణు మాధ‌వ్ ప‌ర్స‌న‌ల్ కాల్స్ వ‌చ్చేవి. దీంతో ఆయ‌న‌ని , అసెంబ్లీ లోని టీడీఎల్పీ ఆఫీసులో లైబ్రరీ అసిస్టెంటుగా చేర్చారు. తరువాత ఎన్టీఆర్ ఇంట్లో అసిస్టెంట్ గా కూడా కొద్దిరోజులు పనిచేశాడు. బొమ్మతో మిమిక్రీ చేస్తాడు కాబట్టి ఎన్టీయార్ ఆయన్ని ”బొమ్మగారూ!” అని ఆప్యాయంగా పిలిచేవారు. అసెంబ్లీలో ప‌ని చేస్తున్న స‌మ‌యంలో వేణు మాధ‌వ్ ర‌వీంద్ర భార‌తికి త‌ర‌చుగా వెళ్లేవారట‌. ఒక‌సారి ఆకృతి సంస్థ వాళ్లు మాట‌ల ర‌చ‌యిత దివాక‌ర్ బాబుకి చేసే స‌న్మాన కార్య‌క్ర‌మంలో వేణు మాధ‌వ్ చిన్న ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చారు. ఇది చూసిన అచ్చి రెడ్డి, కృష్ణారెడ్డి వేణుకి సినిమాలో అవ‌కాశం ఇస్తామ‌ని అన్నారు. అన్న‌ట్టుగానే ఎస్వీ కృష్ణారెడ్డి తెర‌కెక్కించిన సంప్ర‌దాయం (1977) చిత్రంలో ఆయ‌న‌కి అవకాశం ఇచ్చారు. ఆ త‌ర్వాత ప‌లు చిత్రాలు చేసిన‌ప్ప‌టికి, తొలి ప్రేమ చిత్రంలో అమ్మాయిల‌పై ఆయ‌న చెప్పిన చాంతాడంత‌ డైలాగ్‌తో వేణు మాధ‌వ్ అంద‌రి దృష్టిలో ప‌డ్డాడు. దిల్ సినిమా కూడా మంచి పేరు వచ్చింది. లక్ష్మి సినిమాతో ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డును అందుకున్నాడు.ఇంకా అతనికి పేరు తెచ్చిన సినిమాలు తొలిప్రేమ, సై, ఛత్రపతి, మొదలైనవి. న‌ల్ల‌బాలు న‌ల్ల తాచు లెక్క అని వేణు మాధ‌వ్ చెప్పిన డైలాగ్ చాలా ఫేమ‌స్.

Related posts