telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన ఆలీ

Ali

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమంలా ముందుకు సాగుతోంది. సినీ, రాజకీయ ప్రముఖులు సైతం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొంటున్నారు. బక్రీద్ పండుగ పురస్కరించుకొని మిమిక్రి ఆర్టిస్ట్ శివారెడ్డి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ ప్రముఖ కమెడియన్ అలీ మణికొండ లోని తన ఇంటి పరిసర ప్రాంతాలలో కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. ఎం.పి సంతోష్ కుమార్ గారు ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆలీ అన్నారు. తన సోదరుడు సినీ ఆర్టిస్ట్ ఖయుమ్, బావమరిది కరీంకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు ఆలీ.

Related posts