telugu navyamedia
క్రీడలు వార్తలు సినిమా వార్తలు

బుమ్రాతో పెళ్లి పై స్పందించిన అనుపమ…

అభినయంతో అందరినీ బుట్టలో వేసుకున్న అనుపమ పరమేశ్వరన్ భారత పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను వివాహం చేసుకోనున్నారని అనేక వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ వార్తలపై అనుపమ తల్లిగారు క్లారిటీ ఇచ్చారు. వీరి పెళ్లి గుజరాత్‌లో జరగనుందని, అందుకనే అనుపమ ఇటీవల గుజరాత్ వెళ్లారని టాక్ నడిచింది. అయితే అదేమీ లేదని, అనుపమ తన సినిమా కోసం గుజరాత్‌కు వెళ్లారని, అంతకు మించి ఇంకేమీ లేదని, ఒకవేళ అనుపమ పెళ్లి ఫిక్స్ అయితే మేమే చెప్తామని అప్పటి వరకు ఎటువంటి పుకార్లు పట్టించుకోవద్దని అనుపమ తల్లి తెలిపారు. ఇదిలా ఉంటే భారత పేస్ బౌలర్ తన వివాహ వేడుక కారణంగానే ఇంగ్లండ్‌తో ఆడాల్సిన వన్డేలు, టీ20లకు దూరమయ్యారు. ఇదే సమయంలో అనుపమ గుజరాత్‌కు వెళ్లడంతో ఈ యార్కర్ స్పెషలిస్ట, ప్రేమమ్ ముద్దుగుమ్మ పెళ్లి పీటలెక్కనున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ వార్తలపై క్లారిటీ వచ్చినప్పటికీ బుమ్రా పెళ్లి చేసుకోబోయేది ఎవరిని అన్న విషయంలో మాత్రం అపోహలు వీడటం లేదు. చూడాలి మరి భూమిరా ఈ విషయాన్ని ఎప్పుడు ప్రకటిస్తాడు అనేది.

Related posts