telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఆ సీక్వెల్ సినిమాలోని కీలక పాత్రలో పాత హీరో…

Srikanth

ప్రస్తుతం దర్శకుడు రాఘవేంద్ర రావు పెళ్ళిసందD సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు ముందు శ్రీకాంత్ హీరోగా పెళ్ళిసందడి సినిమా 1996లో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఆదరణ పొందింది. అప్పట్లోనే పెట్టిన దానికన్నా దాదాపు రూ.10కోట్ల లాభాలు వచ్చాయని నిర్మాతలు అంటూ ఉంటారు. ఈ సినిమాలో దీప్తి భట్‌నాగర్, రాలవలిలు హీరోయిన్స్‌గా చేశారు. ఇందులో ప్రముఖ నటులు బాబు మోహన్, ఏవీఎస్‌లు ప్రధాన పాత్రలోల కనిపించి అందరిని కడుపుబ్బా నవ్వించారు. అయితే ఈ సినిమా ఆల్ టైమ్ హిట్, దాంతో ప్రేక్షకులు ఈ సినిమా రీమెక్ లేదా సీక్వెల్‌ను కోరారు. ఈ సమయంలో రాఘవేంద్ర రావు ’పెళ్ళిసందD‘ని పర్కటించారు. అయితే అప్పట్లో సినిమాకి ఈ సినిమాకి సంబంధం ఉందాలేదా అనేది ఇంకా సందేహాల్లోనే ఉంది. ప్రధాన పాత్ర హీరోలలో మాత్రం సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. అప్పట్లో వచ్చిన పెళ్ళిసందడి సినిమాలో శ్రీకాంత్ కథానాయకుడిగా కనిపించాడు. ఇప్పుడు రాబోతున్న పెళ్ళిసందDలో మాత్రం అతని కుమారుడు రోషన్ హీరోగా కనిపించనున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి తదుపరి సమాచారం వెల్లడికాలేదు. ఇందులో రోషన్ ప్రధాన పాత్ర కాగా శ్రీకాంత్ కీలక పాత్రలో కనిపించనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమయితే ఈ సినిమాకు తండ్రికొడుకుల సినిమాగి మంచి పబ్లిసిటీ వస్తుంది.

Related posts