telugu navyamedia
సినిమా వార్తలు

మా నాన్న నక్సలైట్ జులై 8 న విడుదల..

గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు రఘు కుంచె లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘మా నాన్న నక్సలైట్‌’. పి. సునీల్‌ కుమార్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. చదలవాడ బ్రదర్స్‌ సమర్పణలో అనురాధ ఫిలిమ్స్‌ డివిజన్‌పై చదలవాడ శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న విడుదలవుతోంది.

ఇందులో నటుడు అజయ్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా  అలాగే సుబ్బరాజు రాజకీయ నాయకుడు పాత్రలో నటించగా జర్నలిస్ట్ సూర్య ప్రకాష్ రావు పాత్రలో ఎల్ బి శ్రీరామ్ నటించారు.

యువ న‌టులు కృష్ణ బూరుగుల, రేఖ నిరోషా నటించిన ఈ చిత్రానికి సంగీతం అందించింది ప్రవీణ్ ఇమ్మడి. 

ఈ సందర్భంగా చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ– హృదయానికి హత్తుకునే సినిమా, ‘‘గతంలో ‘మాతృదేవోభవ’ చిత్రం చూసి ఎంత భావోద్వేగానికి లోనయ్యానో ‘మా నాన్న నక్సలైట్‌’ చూశాక అంతే అనుభూతికి లోనయ్యాను’’ అన్నారు.

‘‘ఈ చిత్రం ట్రైలర్‌ చూస్తుంటే దాసరి  నారాయణరావుగారు తీసిన ‘ఒసేయ్‌ రాములమ్మ’ చిత్రం గుర్తుకు వచ్చింది’’ అన్నారు దర్శకుడు రేలంగి నరసింహారావు. ‘‘నా తండ్రికి ఇచ్చే సెల్యూట్, నా కొడుకుకి ఇచ్చే గిఫ్ట్‌ ఈ సినిమా’’ అన్నారు సునీల్‌ కుమార్‌ రెడ్డి.

మా నాన్న నక్సలైట్, ఇలాంటి టైటిల్ పెట్టి సినిమా తీయాలి అనుకోవడం చాలా గొప్ప విషయం. ఇలాంటి సినిమా తీసిన దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి గారికి మరియు నిర్మాత చదలవాడ శ్రీనివాస్ గారికి హాట్స్ ఆఫ్ దర్శకుడు అజయ్ గారు అన్నారు . 

” ప్రతి తల్లీ తండ్రి చాలా కష్ట పడి వాళ్ళ పిల్లలను చదివిస్తారు మంచి స్థాయి లో నిలబడతారు. కానీ కొందరు పిల్లలు వాళ్ల తల్లిదండ్రుల చేసే వృత్తి చెప్పుకోవటానికి ఇష్టపడరు. కానీ కొందరు చాలా గర్వంగా వాళ్ళ తల్లిదండ్రులు చేసే వృత్తి గురించి చెప్పు కుంటారు అన్నారు.

నటి రేఖ నిరోషా మాట్లాడుతూ “నాకు ఈ చిత్రం లో అవకాశం ఇచ్చిన దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు, ఈ చిత్రం లో కాశీ విశ్వనాధ్ గారు నాకు తండ్రి గా నటించారు. సర్ తో నటించడం చాలా సంతోషంగా ఉంది. మా నాన్న నక్సలైట్ చాలా మంచి చిత్రం, అందరూ చూడండి” అని తెలిపారు.

 

Related posts