telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రష్మీకి నెటిజన్ రిక్వెస్ట్… యాంకర్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా

హాట్ యాంకర్ రష్మీ జబర్దస్త్‌, ఢీ ఛాంపియన్స్, అనుభవించు రాజా’ లాంటి ప్రోగ్రామ్స్ ద్వారా బుల్లితెర పై హవా కొనసాగిస్తూనే, మరోవైపు వెండితెరపై ఆచితూచి అడుగులేస్తోంది. రష్మీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బొమ్మ బ్లాక్‌బస్టర్’ నుంచి ఇటీవలే విడుదలైన ఆమె లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాగా తాజాగా రష్మీ చేసిన పనికి ప్రశంసల జల్లు కురుస్తోంది. ఓ నిరుద్యోగి రిక్వెస్ట్ కు రష్మీ కరిగిపోయింది. ”మేడమ్ దయచేసి నాకు సహాయం చేయండి. నేను పోటీ పరీక్షలకు కోసం ప్రిపేర్ అవుతున్నాను. డిసెంబర్ 15వ తేదీన నాకు పరీక్ష ఉంది. ఆ పరీక్షకు సన్నద్ధం కావడానికి రెండు పుస్తకాలు కావాలి. కానీ అవి కొనుక్కొనే స్థోమత నాకు లేదు. ఆ రెండు పుస్తకాలు కొనిస్తే నా విజయానికి మీరు కారణమవుతారు. ఈ జాబ్ నేను ఎలాగైనా సాధించాలి. దయచేసి సహాయం చెయ్యి అక్కా” అని అభ్యర్థిస్తూ ఆ బుక్స్ ఫోటోలను పోస్ట్ చేశాడు. దీంతో ఇది చూసిన రష్మీ వెంటనే సదరు నిరుద్యోగి ట్వీట్‌పై స్పందిస్తూ ”నీ అడ్రస్ చెప్పు.. వాటిని కొని మీకు పంపిస్తా” అని రిప్లై ఇచ్చింది. దీంతో రష్మీ పెద్ద మనసుకు ఫిదా అవుతున్నారు నెటిజన్లు.

Related posts