telugu navyamedia
రాజకీయ వార్తలు

రైతు వ్యతిరేక బిల్లు అని అనలేదు..ఎంపీ హర్‌సిమ్రత్ కౌర్ వివరణ

Harsimrat Kaur

కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లును వ్యతిరేకిస్తూ కేంద్ర మంత్రి పదవికి శిరోమణి అకాలీదళ్ ఎంపీ హర్‌సిమ్రత్ కౌర్ రెండు రోజుల క్రితం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రైతు వ్యతిరేక ఆర్డినెన్స్‌లు, చట్టాలకు నిరసనగానే మంత్రి పదవికి రాజీనామా చేసినట్టు చెప్పారు.అంతలోనే ఆమె యూటర్న్ తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

తాజాగా ఓ జాతీయ చానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ఆమె మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ సవరణ బిల్లును రైతు వ్యతిరేక బిల్లు అని తాను అనలేదని స్పష్టం చేశారు. అలాంటి వ్యాఖ్యలు తాను చేయలేదని అన్నారు. రైతుల క్షేమం కోరే ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చిందంటూ మాట మార్చారు. రైతులందరూ ఈ విషయాన్ని గుర్తించి బిల్లుకు మద్దతు పలకాలని ఆమె కోరారు.

Related posts