telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కత్రినా కొత్త బాయ్ ఫ్రెండ్… బాలీవుడ్ లో హాట్ టాపిక్…!?

Kathrina

బాలీవుడ్ బార్బీడాల్ కత్రినా కైఫ్ ప్రేమలో పడిందంటూ కోడై కూస్తున్నాయి బాలీవుడ్ వర్గాలు. గతంలో బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్‌తో చాలా కాలం పాటు డేటింగ్ చేశారు కత్రినా. ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో లివిన్ రిలేషన్‌షిప్‌లో ఉండేవారు. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలీదు కానీ రణ్‌బీర్, కత్రినా విడిపోయారు. ఆ తరువాత సల్మాన్ తో కూడా కత్రినా డేటింగ్ చేస్తోందంటూ వార్తలు వచ్చాయి. తాజాగా బాలీవుడ్ నటుడు విక్కీ కౌషల్‌తో కత్రినా డేటింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఓ అవార్డ్ వేడుకలో కత్రినాకు విక్కీ సరదాగా ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత ఇద్దరికీ ఒకరంటే ఒకరిపై ఇష్టం పెరిగినట్లుంది. ఆదివారం ముంబయిలో జరిగిన దీపావళి వేడుకలకు ఇద్దరూ కలిసే హాజరయ్యారు. ఆ తర్వాత ఎవ్వరికీ తెలీకుండా విడివిడిగా తమ కార్లలో వెళ్లిపోయారు. అయితే వారిద్దరూ కేవలం ఫ్రెండ్స్ అని, ఇద్దరూ సింగిల్‌గానే ఉన్నారని సన్నిహితులు అంటున్నారు. త్వరలో కత్రినా, విక్కీ కౌషల్ కలిసి ఓ సినిమాలో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కత్రినాకు ఇప్పుడిప్పుడే పెళ్లి ఆలోచనలు లేనట్లున్నాయి. ఇటీవల కే కాస్మెటిక్స్ పేరుతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం కత్రినా.. ‘సూర్యవంశి’ సినిమాతో బిజీగా ఉంది. ఇందులో అక్షయ్ కుమార్‌కు జోడీగా నటిస్తోంది.

Related posts