telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఆంధ్రప్రదేశ్ లో బడి గంట మళ్లీ మోగింది..

ఆంధ్రప్రదేశ్ లో బడి గంట మళ్లీ మోగింది. వేస‌వి సేల‌వులు పూర్త‌వ‌డంతో నేటి నుంచి  రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పున:ప్రారంభం అయ్యాయి.

మే నెలలో ఆలస్యంగా వేసవి సెలవులు ఇచ్చిన ప్రభుత్వం తొలుత ఈ నెల 4వతేదీ వరకూ పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. అయితే 4వ తేదీన ప్రధాని మోదీ పర్యటన ఉండటంతో ఒకరోజు సెలవును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

2022-2023 విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభం కావడంతో సిలబస్ వేగంగా పూర్తి చేయాలని ఉపాధ్యాయులకు ఆదేశాలు అందాయి. రాష్ర్ట విద్యా ప‌రిశోధ‌న‌, శిక్ష‌ణ మండ‌లి అకాడ‌మిక్ క్యాలెండ‌ర్‌ను కూడా విడుద‌ల చేసింది.

ఏ రోజున ఏయే కార్యక్రమాలు చేపట్టాలో అందులో పొందుపరిచింది. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి పాఠశాలలు ప్రారంభం అయ్యాయి.

సహజంగా జూన్ మూడు, నాలుగో మాసంలో పాఠశాలలను తిరిగి తెరుస్తారు. అయితే ఆలస్యంగా వేసవి సెలవులు ఇవ్వడంతో ఈసారి జులై మొదటి వరకూ పాఠశాలలు తెరుచుకోలేదు.ఈ ఏడాది 22 రోజులు అదనంగా సెలవులు లభించాయి.

Related posts