telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

ఏపీ నుండి హైదరాబాద్ కు అంబులెన్సులు… అనుమతించని తెలంగాణ పోలీసులు

Ambulance

కర్నూలు శివార్లలో తెలంగాణ సరిహద్దు వద్ద ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్తున్న అంబులెన్సులను అడ్డుకుంటున్నారు తెలంగాణ పోలీసులు. హైదరాబాద్ ఆసుపత్రుల్లో బెడ్ల కొరత ఉందని ఏపీ అంబులెన్సులను సరిహద్దులో అనుమతించలేదు పోలీసులు. వచ్చిన అంబులెన్సులన్నీ వెనక్కి పంపుతున్నారు తెలంగాణ పోలీసులు. సరిహద్దులో కన్నీటి పర్యంతమవుతున్నారు కరోనా బాధితులు. అంబులెన్సులో ప్రాణాపాయంలో ఉన్న రోగి బంధువుల ఆక్రంధన చేస్తున్నారు. అంబులెన్సులు టీఎస్ ఆపటంపై రాజకీయ విమర్శలు వస్తున్నాయి.  టీఎస్ ప్రభుత్వ తీరుపై వైసీపీ ఎమ్మెల్యే సామినేని కీలక వ్యాఖ్యలు చేసారు. అంబులెన్సులకు అనుమతి ఇవ్వాలని టీఎస్ పోలీసులను కోరాం. హెల్త్ ఎమెర్జెన్సీలో తీవ్ర సంక్షోభంలో ఉన్నాము. మెరుగైన వైద్యం కోసం ఎక్కడికైనా వెళ్లి వైద్యం చేసుకోవచ్చు. విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ ఇంకా ఉమ్మడి రాజధాని. ఇంకా మూడేళ్ళ వ్యవధి ఉంది అని అన్నారు. కామన్ రాజధాని హైదరాబాద్ వెళ్లకుండా అడ్డుకోవడం మంచి పద్ధతి కాదు. అంబులెన్స్ లు ఆపటం అనైతికం. తెలంగాణ ప్రభుత్వం మానవీయంగా వ్యవహరించాలి అని అన్నారు.

Related posts