చైనా 70 సంవత్సరాల కమ్యూనిస్ట్ పాలన వేడుకలు జరుపుకునే రెండు రోజుల ముందు బీజింగ్‌కు బహిరంగ సవాలుగా ప్రజాస్వామ్య అనుకూల ప్రదర్శనకారులు పోలీసులతో పోరాడడంతో హాంకాంగ్‌లోని మూడు ప్రధాన వాణిజ్య జిల్లాలు ఫైర్‌బాంబులు మరియు టియర్ గ్యాస్ మేఘాలలో మునిగిపోయాయి. అక్టోబర్ 1న రిపబ్లిక్ ఆఫ్ చైనా 70వ జాతీయ దినోత్సవం సందర్భంగా సంబరాలు నిర్వహించేందుకు చైనా మిలిటరీ పరేడ్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. కాగా, చైనా ఆంక్షలను లెక్క చేయకుండా వేల సంఖ్యలో హాంకాంగ్ ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. పోలీసులపై నిరసనకారులు పెట్రోల్ బాంబులు విసిరారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్, పెప్పర్ స్ప్రే, వాటర్ కెనాన్‌లు ప్రయోగించారు. చైనాకు వ్యతిరేకంగా హాంకాంగ్ ప్రజలు 17 వారాలుగా నిరసన చేస్తున్నారు. హాంకాంగ్ లెజిస్టేటివ్ కాంప్లెక్స్ ముందు ఈ నిరసన చేపట్టారు. గొడుగులతో పెద్ద ఎత్తున వచ్చిన నిరసనకారులకు, పోలీసులకు యుద్ధం జరుగుతుందా అన్న తరహాలో కాసేపు పరిస్థితి కనిపించింది. రగాళ్లను చైనాకు అప్పగింత బిల్లును వ్యతిరేకిస్తున్న హాంకాంగ్ ప్రజలు చైనాకు వ్యతిరేకంగా కొంత కాలంగా తీవ్ర నిరసన చేపడుతున్న విషయం తెలిసిందే.
హాంకాంగ్ లో భారీ స్థాయిలో 78రోజులు జరిగిన ప్రజాస్వామ్య అనుకూల గొడుగు ఉద్యమం ప్రారంభించి ఐదేళ్ళు అయిన సందర్భంగా నిరసనకారులు సమావేశమయ్యారు. అయితే శనివారం జరిగిన నిరసనలు కూడా ఆందోళనకరంగ ముగిశాయి, నిరసనకారులు ప్రభుత్వ భవనాలపై ఇటుకలు, పెట్రోల్ బాంబులను విసిరగా.. పోలీసులు నిరసనకారులపైకి నీటి ఫిరంగులను ఉపయోగించారు. హాంకాంగ్ నిరసనకారులు చైనా జాతీయ దినోత్సవంతో సమానంగా మరిన్ని ప్రదర్శనలకు సిద్ధమవుతున్నారు. హాంకాంగ్ అశాంతి బీజింగ్ వేడుకలపై పడకుండా ఉండేలా చూడాలని హాంకాంగ్ అధికారులపై చైనా ఒత్తిడి చేస్తోంది. మంగళవారం(అక్టోబర్ 1,2019) బీజింగ్‌లో జరిగే జాతీయ దినోత్సవ సైనిక కవాతును చైనాఅధ్యక్షుడు జి జిన్‌పింగ్ పర్యవేక్షిస్తారు, 160 కి పైగా విమానాలు మరియు 580 ఆయుధాలు, సుమారు 15 వేల మంది సిబ్బంది ఈ కవాతులో పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఈ వేడుకల్లో పాల్గొనడానికి హాంకాంగ్ నాయకుడు క్యారీ లామ్ సోమవారం బీజింగ్ వెళ్లనున్నారు.
రిటైర్ అయిన వారిని సీఎండీలుగా నియమిస్తున్నారు: రేవంత్