ఆంధ్రప్రదేశ్ లో నిన్నటి నుంచి గ్రామ వాలంటీర్ల వ్యవస్థ అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్ల వ్యవస్థను వివరిస్తూ ట్వీట్ చేశారు.గ్రామ స్వరాజ్యం దిశగా అడుగు వేశామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. అందులో భాగంగా వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించామని చెప్పారు.
ప్రజలు తమ కనీస అవసరాల కోసం ఎవరిచుట్టూ తిరగాల్సిన పనిలేకుండా చేస్తున్నామన్నారు. ప్రతీ 50 కుటుంబాలకు ఓ వాలంటీర్ బాధ్యతను తీసుకుంటారనీ, సంక్షేమ పథకాలను డోర్ డెలివరీ చేస్తారని పేర్కొన్నారు. గ్రామ వాలంటీర్లు గ్రామ సచివాలయంతో అనుసంధానమై ప్రజల సమస్యలను పరిష్కరిస్తారని జగన్ ట్విటర్ లో పేర్కొన్నారు.