telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘అదిరింది’ కమెడియన్ సద్దాంపై హైపర్ ఆది సీరియస్

aadi

హైపర్ ఆది అదిరింది షోతో పాటు అందులో ఉన్న కొందరు కమెడియన్లను కూడా టార్గెట్ చేసాడు. ఈ మధ్యే ఓ ఎపిసోడ్‌లో అదిరింది కమెడియన్ సద్దాం తన స్కిట్‌లో భాగంగా హైపర్ ఆదిపై పంచులు వేసాడు. అది కాదురా అంటూ ఆది కాకపోతే సద్దాం ట్రెండింగ్‌లో ఉంటది అంటూ సెటైర్ వేసాడు. దీనిపై హైపర్ ఆది చాలా సీరియస్ అయ్యాడు. ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ముందుంది ముసళ్ల పండగ ఐదు స్కిట్స్ చేసి ఆదిని దాటేసామంటే ఎలా.. నాన్ బాహుబలి రికార్డుల్లా నాన్ హైపర్ ఆది రికార్డులు అంటూ కొన్ని ఉంటాయి. వాటిని ముట్టుకోవాలంటే మీ వల్ల కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు ఈ కమెడియన్. తనపై పోటీ అంటే అంత ఈజీ కాదంటూ స్టేట్‌మెంట్ ఇచ్చేసాడు. ఇలాంటి రికార్డులు అన్నీ తామెప్పుడో చేసేసాం.. ఇప్పుడు కొత్తగా వీళ్లు వచ్చి హైపర్ ఆదిని దాటేసామంటే ఎలా అంటున్నాడు ఈయన. తన స్కిట్‌కు వచ్చిన హైయ్యస్ట్ వ్యూస్ 58 మిలియన్ అని.. అలాగే 30 మిలియన్ దాటిన స్కిట్స్ రెండు ఉన్నాయని.. 20 మిలియన్ దాటిన స్కిట్స్ 5 ఉన్నాయని.. 10 మిలియన్ దాటిన స్కిట్స్ 40 ఉన్నాయని ఇవన్నీ ఆల్ టైమ్ రికార్డులు అంటూ గుర్తు చేసాడు ఆది.ఎప్పుడో తాను ఐదేళ్ల కిందే దాటేసిన రికార్డులను ఇప్పుడు చూపించి నేను ట్రెండింగ్ అంటే చిన్న పిల్లలాటలా ఉంటుందని చెప్పుకొచ్చాడు ఈయన.

Related posts