telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుశాంత్ ఆత్మహత్య కేసు : రియా ఇంట్లో ఎన్‌సీబీ సోదాలు

Rhea

యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గత జూన్ నెల 14న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసు తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేసే విషయాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఈ కేసులో కీలక విషయాలు రాబట్టే పనిలో ఉన్నారు ఈడీ అధికారులు. ప్రస్తుతం కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోన్న సంగతి తెలిసిందే. సీబీఐ అధికారులు రియా చక్రవర్తి తల్లిదండ్రులను బుధవారం విచారించారు. ఈ కేసులో మొదటిసారిగా రియా తల్లిదండ్రులు సీబీఐ ముందు హాజరయ్యారు. ఇక గతవారం రియా తమ్ముడు షోవిక్‌ను కూడా విచారించిన సంగతి తెలిసిందే. రియాను సీబీఐ అధికారులు నాలుగు రోజులలో 35 గంటల పాటు విచారించారు. ఇక ఈ కేసులో డ్రగ్స్ కోణం వెలుగులోకి రావడం సంచలనం సృష్టించింది. సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్ డ్రగ్‌ కేసులో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) బుధవారం అరెస్ట్‌ చేసింది. ముంబై బాంద్రాకు చెందిన అబ్దుల్ బాసిత్ పరిహార్‌ను అరెస్టు చేసినట్లు ఏజెన్సీ తెలిపింది. ఇప్పటికే డ్రగ్ డీలర్ జైద్ విలాత్రాను అదుపులోకి తీసుకున్న ఎన్‌సీబీ తాజాగా రియాచక్రవర్తి నివాసంలో కూడా సోదాలు చేసింది. రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ సూచనల మేరకు సుశాంత్ మేనేజర్ శామ్యూల్ మిరాండా డ్రగ్స్ సేకరించినట్టు తమకు తెలిసిందని ఎన్‌సీబీ అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. గత ఏడాది మేలో మిరాండాను సుశాంత్‌ ఇంట్లో మేనేజర్‌గా రియా నియమించింది. సుశాంత్ ఇంటికి సంబంధించిన అన్ని వ్యవహారాలను మిరాండానే చూసుకునేవాడు. షోవిక్ చక్రవర్తి ఇంట్లో సోదాలు చేసిన ఎన్‌సీబీ శామ్యూల్ మిరాండా ఇంట్లో కూడా సోదాలు నిర్వహించింది. వీరిద్దరి ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయని, విచారణకు రావాల్సిందిగా షోవిక్ చక్రవర్తికి, శామ్యూల్ మిరాండాకు సమన్లు జారీ చేయనున్నట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ప్రకటించింది.

Related posts