telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నేను ఎప్పుడూ వేధింపులు ఎదుర్కోలేదు : అనుష్క

Anushka

ఎక్కడ చూసినా ఇప్పుడు ‘కాస్టింగ్ కౌచ్’ గురించి చాలా చర్చ జరుగుతుంది. ఎంతోమంది అమ్మాయిలు బయటికి వచ్చి తమకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకుంటున్నారు. అందులో కొందరు స్టార్ హీరోయిన్లు కూడా ఉన్నారు. అయితే దీనిపై ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క కూడా స్పందించింది. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదని మాత్రం తను చెప్పడం లేదని క్లారిటీ ఇచ్చింది ఈమె. అయితే గ్లామర్ ఇండస్ట్రీ కాబట్టి సినిమాను టార్గెట్ చేస్తారు కానీ ప్రతీ రంగంలోనూ ఆడవాళ్ళకి వేధింపులు తప్పడం లేదని అభిప్రాయ పడింది అనుష్క. అంతే కాకుండా మన టాలీవుడ్‌లో ఇది లేదని చెప్పడం లేదు కానీ.. తన వరకు మాత్రం ఎప్పుడూ ఇలాంటివి ఎదుర్కోలేదని చెప్పింది అనుష్క. తాను ముక్కుసూటిగా ఉండటమే కాదు ప్రతీ విషయంలోనూ నిజాయతీగా ఉంటానని అందులో తన వరకు కూడా ఎప్పుడూ ఇలాంటి మీటూ విషయాలు కానీ క్యాస్టింగ్ కౌచ్ కానీ రాలేదని చెప్పుకొచ్చింది అనుష్క. ఓ అమ్మాయి నుంచి ఆమెకు ఇష్టం లేకుండా వేరే రకమైన విషయాలను అడగడం కూడా తప్పే అంటుంది అనుష్క. అది పూర్తిగా ఆమె వ్యక్తిగత విషయమని స్పష్టం చేసింది జేజమ్మ. అలాగే అమ్మాయిలు ఎక్కడైనా పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలంటే ఈజీ వేతో పాటు కష్టమైన దారి కూడా ఉంటుందని.. తాను కఠినమైన దారిలోనే వచ్చానని చెప్పింది ఈమె. అసలు ఇలాంటి వాటికి ‘నో’ అని చెప్పడం నేర్చుకుంటేనే పురుషులు స్త్రీలను గౌరవించడం ప్రారంభిస్తారని చెప్పింది అనుష్క.

Related posts