దేశ వ్యాప్తంగా గురువారం మొదటి విడత పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సొంత ఊర్లకు పెద్ద ఎత్తున రైళ్లలో ప్రజలు వెళ్లడం జరిగింది. దానితో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఏప్రిల్ 10 న ఒక్క సికింద్రాబాద్ స్టేషన్ నుంచే 1.24 లక్షల మంది ప్రయాణికులు వెళ్లినట్టు తేలింది.
ఇందులో 96 వేల మంది జనరల్ టికెట్ ప్రయాణికులు, 28 వేల మంది రిజర్వేషన్ తీసుకున్నవాళ్లు అని దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఇది సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ చరిత్రలోనే ఇది రెండో అత్యధిక రికార్డని చెప్పడం విశేషం. సికింద్రాబాద్ తో పాటు నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి రైల్వేస్టేషన్‌ల నుండి కూడా భారీగా ప్రయాణికులు వెళ్లారు. మొత్తం మీద ఓట్ల పండగా దక్షిణమధ్య రైల్వే కు బాగా కలిసొచ్చింది.