telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

మూడు పాత్రలో నటించనున్న రామ్…?

Ram-Pothineni

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని తన తదుపరి చిత్రంలో మూడు పాత్రలు చేయనున్నారంట. కాస్త డల్‌గా ఉన్న తన కెరీర్‌ని ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కించిన రామ్ తాజాగా రెడ్ సినిమాలో రెండు పాత్రల్లో కనిపించారు. ఇప్పుడు ఏకంగా మూడు పాత్రలు చేసేందుకు సిద్దమవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కథ విన్న వెంటనే రామ్‌కు చాలా బాగా నచ్చేసిందంట, దాంతో వెంటనే సినిమాకు సంతకం చేశారంట. అయితే రామ్ నటించిన రెడ్ సినిమాలో రెండు పాత్రలకు రామ్ న్యాయం చేశారు. రెడ్ సినిమాలో అమృతా అయ్యర్, మాళవిక శర్మ హీరోయిన్‌లుగా నటించారు. ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తరువాత రామ్ చేయనున్న సినిమాపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. అయితే తాజాగా రామ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. స్మాల్ బ్రేక్ తరువాత తన కొత్త సినిమాను ప్రకటిస్తానని తెలిపారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తుంది. చూడాలి మరి ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది.. అలాగే ప్రేక్షకులను ఆకటుకుంట్టుందా.. లేదా అనేది.

Related posts