telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

వాహనదారులకు బ్యాడ్‌ న్యూస్‌…రూల్స్‌ బ్రేక్‌ చేస్తే 2000 ఫైన్‌ !

హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు సౌండ్‌ పొల్యూషన్‌ వాహనాలపై నజర్‌ పెట్టారు. ఏ వాహనాలపై సౌండ్‌ చేస్తే… వాత తప్పదని కొత్త రూల్స్‌ తీసుకువచ్చారు !. సౌండ్‌ పొల్యూషన్‌ వాహనాలపై హైదరాబాద్ ట్రాఫిక్ ఆడిషనల్ సిపి అనిల్ కుమార్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. WHO గైడ్ లైన్స్ ప్రకారం… 65 డిసిబుల్ సౌండ్ మించి పైన ఉంటే నోయిస్ పొల్యూషన్ అవుతుందని.. 75 డిసిబుల్ ఉంటే హార్మ్ ఫుల్, 120 పైన ఉంటే పెయిన్ ఫుల్ గా ఉంటుందన్నారు. రోడ్లపై సౌండ్ పొల్యూషన్ చేస్తున్న బైకులను సీజ్ చేస్తున్నామని… బైక్ వాహనదారులు ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ కు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. సౌండ్ పొల్యూషన్ వలన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని… నాయిస్ పొల్యూషన్ వలన చాలా మంది అనారోగ్యానికి గురి అవుతున్నారని తెలిపారు. 2021లో జనవరి లో సౌండ్ పొల్యూషన్ కు సంబంధించి 1134 వాహనాలు చేశామని వెల్లడించారు. గత యేడాది జనవరిలో 24 రోడ్డు మరణాలు చోటు చేసుకోగా ఈ ఏడాది జనవరిలో 10 రోడ్డు ప్రమాదాలు జరిగాయని అన్నారు. బైకులు కొనేటప్పుడు ఉన్న సైలెన్సర్లను తీసివేసి ఎక్కువ సౌండ్ ఉన్న సైలెన్సర్లను అమర్చికుంటున్నారని… దాంతో సౌండ్ పొల్యూషన్ పెరుగుతుందని తెలిపారు. మొదటి సారి సౌండ్ పొల్యూషన్ కి పాల్పడితే 1000 రూపాయల జరిమానా, సెకండ్ సారి పట్టు పడితే 2000 రూపాయల జరిమానా విధిస్తామని.. ఎలాంటి వాహనాలు అయిన సౌండ్ పొల్యూషన్ కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Related posts