telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణాలో కరోనా కట్టడికి హైకోర్టు కీలక ఆదేశాలు

high court on new building in telangana

కరోనా కట్టడికి తెలంగాణా హైకోర్టు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు ఇవాళ సుదీర్ఘ విచారణ చేపట్టింది. హైకోర్టు ఆదేశాలను అమలు చేయని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి ప్రభుత్వానికి పలు కీలక ఆదేశాలను హైకోర్టు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో రెండవ స్టేజ్ కరోనా తీవ్ర ప్రభావం చూపుతోందన్న హైకోర్టు..WHO నిబంధనల ప్రకారం వెయ్యి మందికి 3 బెడ్లు ఉండాలి కానీ తెలంగాణ లో ఆ పరిస్థితి లేదని ప్రశ్నించింది. కరోనా టెస్టుల పై ఇక నుండి తప్పుడు రిపోర్ట్ ఇవ్వకుండా చూడాలని పేర్కొంది. ప్రతి ప్రభుత్వ హాస్పిటల్ వద్ద డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలన్న హైకోర్టు..రాష్ట్రంలో మొబైల్ టెస్ట్ వెకిల్స్ పెంచాలంది. రాష్ట్రంలో అంబులెన్స్ లు 350 ఉన్నాయి..గతంలో 169 అంబులెన్స్ కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారని..హామీలో 30 మాత్రమే కొనుగోలు చేశారు మిగిలినవి ఎప్పటి వరకు కొనుగోలు చేస్తారని ప్రశ్నించింది హైకోర్టు.

ఇతర రాష్ట్రాలలో కేసులు, మరణాలు, టెస్టులు ఏవిధంగా ఉన్నాయి మన రాష్ట్రం లో ఈవిధంగా ఉన్నాయి అనే అంశాలపై గ్రాఫ్ ను తయారు చేయాలన్న హైకోర్టు.. కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ కేసులు , మరణాలు, టెస్టుల పై గ్రాఫ్ రీపోర్ట్ తయారు చేయాలని ఆదేశించింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న వెంటిలేటర్స్ సరిపోవని వీటిని పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్న హైకోర్టు.. కరోనా వచ్చిందని చాలా మంది ఆత్మహత్య లు చేసుకుంటున్నారని పేర్కొంది. వారికి మనోధైర్యం ఇవ్వాల్సింది ప్రభుత్వమేనన్న హైకోర్టు.. అలాంటి వారి కోసం హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేయాలని తెలిపింది. హైకోర్టు ఆదేశాల ను అమలు చేసి పూర్తి నివేదిక నవంబర్ 16 లోగా సమర్పించాలని ప్రభుత్వానికి అదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 19 కు వాయిదా వేసింది హైకోర్టు.

Related posts