telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలయ్య, బోయపాటి సినిమాకు ఆ టైటిలే ఫిక్స్ అయ్యారా ?

BB3

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వర్కింగ్ టైటిల్ “బిబి-3” పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన బీబీ 3 టీజర్‌కి మాస్ ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ సినిమాతో ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్, కరోనా కారణంగా వాయిదా పడగా, త్వరలోనే తిరిగి సినిమా షూటింగ్ ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమాకు ఇప్పటికే పలు పేర్లు వినిపించాయి. ఎప్పటిలాగే వీరి సినిమా ఫుల్ మాస్ అండ్ యాక్షన్ డ్రామాగా సాగనుంది. అందుకే ‘‘మోనార్క్‌” అనే పవర్ ఫుల్ టైటిల్ ను బాలయ్య సినిమాకి పెట్టబోతున్నారని బాగా వినిపిస్తోంది. అయితే టైటిల్ పై ఇప్పటికే అనేక రూమర్స్ వచ్చాయి. అందులో మెయిన్ గా ‘టార్చ్ బెర్రర్’ అనే టైటిల్‌ తో పాటు డేంజర్ అనే టైటిల్ కూడా బాగా వినిపించింది. అయితే బాలయ్య సినిమా కథకు ఈ ‘‘మోనార్క్‌” అనే టైటిల్ పర్ఫెక్ట్ గా సరిపోతుందని, అందుకే బోయపాటి కూడా ఈ టైటిల్ పెట్టడానికే బాగా ఆసక్తిగా ఉన్నాడని, ఆల్ మోస్ట్ ఇక ఇదే టైటిల్ ను బోయపాటి టీం ఫిక్స్ చేసినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.

Related posts