telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఆర్‌ఆర్‌ఆర్‌” సాలిడ్ టీజర్ లో మెగాస్టార్‌ వాయిస్‌ ఓవర్.!

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ “‘రౌద్రం రణం రుధిరం”. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. టాలీవుడ్ స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో సీత పాత్రలో రామ్‌‌చరణ్‌కు జోడీగా ఆలియా నటిస్తోంది. అలాగే ఎన్టీఆర్ సరసన బ్రిటీష్ భామ పాత్రలో హాలీవుడ్ నటి ఒలివియా మోరిస్ నటిస్తుంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ను తిరిగి మొదలు పెట్టాడు జక్కన్న. ఇప్పటికే విడుదలైన అల్లూరి, భీమ్ టీజర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి. అయితే… ఈ సినిమా తాలుకా టీజర్‌ను ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా మేకర్స్‌ రిలీజ్‌ చేయనున్నారని అనే వార్త బాగానే వైరల్‌ అయింది. ఇక దీనిపై మరో వార్త వైరల్‌ అవుతోంది. ఈ సాలిడ్‌ టీజర్‌కు గాను మెగాస్టార్‌ చిరంజీవి వాయిస్‌ ఓవర్‌ అందించనున్నట్టుగా లెటెస్ట్‌ టాక్‌. ఈ మధ్య ఈ సినిమాకి ఆయా ఇండస్ట్రీల నుంచి పలువురు స్టార్‌ హీరోలు తమ గాత్రాన్ని ఇస్తున్నారని టాక్‌ వచ్చి సంగతి కూడా తెలిసిందే.. మరి అలానే ఇప్పుడు ఈ టీజర్‌కు మెగాస్టార్‌ చిరు స్టార్ట్‌ చేయనున్నారని టాక్‌ నడుస్తోంది. అయితే… దీనిపై అతి త్వరలోనే క్లారిటీ రానుంది.

Related posts