నటుడు ప్రభాస్ పుట్టింది పొలిటికల్ ఫ్యామిలీనే అయినా ఆ దిశగా ఏనాడూ ఆలోచించలేదని ఇప్పటికి చాలా సార్లు చెప్పుంటారు. ఈ వార్త కూడా ఆయన పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిందేమీ కాదు. రకరకాల రీజన్లతో వివిధ పార్టీలవాళ్లు ఆయన్ని ఇదివరకు కూడా కలిశారు. కానీ ఏపీలో బీజేపీ యాక్టివ్ అవుతున్న తరుణంలో ప్రస్తుత పరిణామం హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ ముఖ్యనేత, నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇటీవలే ప్రభాస్ ను కలిసిన ఫొటోలు వైరలయ్యాయి.
అసలు విషయానికి వస్తే.. కృష్ణంరాజు జనవరి 20న బర్త్ డే జరుపుకున్నారు. ఆ వేడుక కు రాలేని మిత్రుల కోసం మళ్లీ విడివిడిగా పార్టీ ఇచ్చారు. సినీ ప్రముఖులకు ఓసారి, పొలిటికల్ పర్సనాలిటీలకు మరోసారి విందు ఇచ్చారు. ఆలా బీజేపీ నేతలకు కృష్ణంరాజు ఇచ్చిన విందులో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పాల్గొనడం, రెబల్ స్టార్, యంగ్ రెబల్ స్టార్ లతో కలిసి దిగిన ఫొటోలు దిగడం చర్చనీయాంశమైంది.