ఐపీఎల్ 2021 మూడో మ్యాచ్‌లో ఈరోజు సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కత నైట్ రైడర్స్ తలపడబోతున్నాయి. కోల్‌కత నైట్ రైడర్స్‌తో పోల్చుకుంటే గత ఏడాది ఎమిరేట్స్ వేదికగా సాగిన ఐపీఎల్ 2020లో సన్ రైజర్స్ అద్భుతంగా రాణించింది. మూడోస్థానంలో నిలిచింది. ఈసారి కూడా అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్ కు ముందు కోల్‌కత జట్టు ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్.. న్యూ లుక్‌తో కనిపించాడు. జుట్టుకు రంగేశాడు. లేత గోధుమ రంగు కలర్‌తో నింపేశాడు. ట్రెండీ హెయిర్ స్టైల్‌తో ఫొటోలకు ఫోజులిచ్చాడు. సాధారణంగా ఐపీఎల్ మెగా టోర్నమెంట్ ఆరంభానికి ముందు కొత్త లుక్‌తో బరిలోకి దిగడం ఆండ్రీ రస్సెల్‌కు అలవాటే. ఇక్కడే ఓ చిన్న కిటుకు ఉంది. అతను హెయిర్ కలర్ వేసిన సమయంలో ఆడిన మ్యాచ్‌ను కోల్‌కత నైట్ రైడర్స్ గెలిచిన సందర్భాలు ఉన్నాయి. 2019 ఐపీఎల్ సీజన్‌లో జుట్టుకు రంగు వేసిన అనంతరం ఆడిన మ్యాచ్‌లో అతను ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై 19 బంతుల్లో 49 పరుగులు చేశాడు. ఇప్పుడు కూడా అదే రేంజ్‌లో ఆటతీరును ప్రదర్శించడానికి ఆండ్రీ రస్సెల్ ఉవ్విళ్లూరుతున్నాడు. ఇదే విషయాన్ని ఆ జట్టు ట్విట్టర్ వేదికగా కూడా తెలిపింది.
previous post