telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

భూమాత ముద్దు బిడ్డలం…

నీ కండల కష్టంతో
శ్వేద జలం పారించి
పొలంలో పంటలు పండించు రైతన్నా
నేను సిపాయినై
కంటిపై కునుకైనా లేకుండా
నా ప్రాణాలను ఫణంగా పెట్టి
దేశానికి కాపుంటానులే రైతన్నా
మనిద్దరి శ్రమా చాలులే రైతన్నా
దేశ ప్రజ తృప్తిగా తిని
ప్రశాంతంగా నిద్దరోతుందిలే రైతన్నా…
ఇది దేవుడు మనకిచ్చిన వరమేమో రైతన్నా
నువ్వు హలంతో పొలంలో
బువ్వెట్టే తల్లిలా…
నేను తుపాకీతో సరిహద్దులో
కాపుకాసే తండ్రిలా…
నువ్వు కష్టానికి జంకవూ
నేను ప్రాణానికి వెరవనూ
మనమిద్దరమే ఈ భూమాత ముద్దు బిడ్డలం
ఇది మన భాధ్యతేలే రైతన్నా…

Related posts