తమిళ స్టార్ హీరో ఇటీవల విజయ్ ఇంటిపై ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. తాను నటిస్తున్న ‘మాస్టర్’ సినిమా సెట్స్‌కు వెళ్లి మరీ ఐటీ అధికారులు ఆయన్ను దాదాపు ఐదు గంటల పాటు విచారించారు. అంతేకాదు షూటింగ్ స్పాట్ నుంచి విజయ్‌ను వేరే ప్రదేశానికి తీసుకెళ్లాల్సి వచ్చింది. దాంతో ఆ రోజున షూటింగ్ నిలిపివేయాల్సి వచ్చింది. వరుసగా మూడు రోజుల పాటు విజయ్ ఇంట ఐటీ సోదాలు జరిగాయి. ఆ తర్వాత విజయ్ పన్నులు కడుతున్నారని, ఆయన వద్ద ఎలాంటి డబ్బు దొరకలేదని తేలడంతో క్లీన్ చిట్ ఇచ్చారు. అయితే ఈ విషయంపై దక్షిణాదిలో తీవ్రంగా చర్చ జరిగింది. అంతేకాదు ఇది రాజకీయ కుట్ర అనే వివాదం తెర మీదకు వచ్చింది. ప్రస్తుతం `మాస్టర్` చిత్రీకరణలో పాల్గొంటున్న విజయ్ ఐటీ తనిఖీల కారణంగా కొద్ది రోజులు ఇంట్లోనే ఉండిపోయాడు. తాజాగా మళ్లీ ఆ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఆదివారం సాయంత్రం ఆ సినిమా షూటింగ్ స్పాట్‌లోనే అభిమానులతో విజయ్ సమావేశమవుతాడని టాక్ బయటకు వచ్చింది. దీంతో విజయ్ అభిమానులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ట్రాక్టర్లు, లారీలు, వ్యాన్‌లలో షూటింగ్ స్పాట్‌కు తరలివచ్చారు. వారిని కట్టడి చేయడం పోలీసులకు తలకు మించిన భారంగా తయారైంది. వారి కోసం విజయ్ బయటకు వచ్చి సందడి చేశాడు. ఓ వ్యాన్ పైకి ఎక్కి సెల్ఫీ తీశాడు. కొందరు అభిమానులతో కరచాలనం చేశాడు. అనంతరం ఏమీ మాట్లాడకుండానే షూటింగ్‌కు వెళ్లిపోయాడు.
Thalapathy @ActorVijay‘s selfie with his fans on the last day shoot of #Master in Neyveli pic.twitter.com/Vnvy4RQgUo
— BARaju (@baraju_SuperHit) February 10, 2020