telugu navyamedia
సినిమా వార్తలు

‘ఎదగరా.. ఎదగరా..దినకరా’ గుండెలను పిండేసే అమ్మ పాట..

కన్నడ నటుడు యశ్‌ యాష్ హీరోగా న‌టించిన సినిమా ‘కేజీఎఫ్‌ చాప్టర్‌ 2’ . ఈ సినిమాలో శ్రీనిధి హీరోయిన్‌గా న‌టించింది. 2018లో రికార్డులు సృష్టించిన చిత్రం కేజీఎఫ్‌’.. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా తెర‌కెక్కిన ‘కేజీఎఫ్‌ చాప్టర్ 2’ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మించారు.

వచ్చే నెల 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్​ స్పీడ్‌ పెంచింది చిత్ర యూనిట్‌. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్‌, ట్రైలర్‌ యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్‌ చేశాయి

తాజాగా ఈ చిత్రం నుంచి అమ్మ పాట (వాయిస్‌ ఆఫ్‌ ఎవ్రీ మదర్‌)ను విడుదల చేశారు. ‘ఎదగరా.. ఎదగరా..దిన‌క‌రా’ అంటూ సాగే ఈ పాట ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. రవి బస్రూర్ సంగీతం సమకూర్చిన ఈ పాటకి తెలుగులో రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా, సుచేత బస్రూర్ అద్భుతంగా ఆలపించారు.

ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ ‘అధీరా’ అనే ప‌వ‌ర్‌పుల్‌ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. సీనియర్​ నటి రవీనాటాండన్‌, రావురమేష్‌, ప్రకాశ్‌ రాజ్‌, రావు రమేష్, కీలక పాత్ర పోషించారు.

Related posts