telugu navyamedia
సినిమా వార్తలు

‘విరాట పర్వం’ నుంచి ‘నగాదారిలో’ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్..

రానా దగ్గుబాటి, సాయి పల్లవి హీరో హీరోయిన్‌గా నటించిన చిత్రం విరాటపర్వం. వేణు ఉడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వెన్నెల అనే పాత్రలో సాయి పల్లవి నటిస్తుండగా, రవి శంకర్ అలియాస్ రవన్న అనే కామ్రేడ్ పాత్రలో రానా నటిస్తున్నాడు.

ఇప్పటికే ఈ చిత్రం  నుంచి  రిలీజ్ అయిన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకులను  ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు ఇటీవల రెండు సాంగ్స్ కూడా రిలీజ్ అయి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

Virata Parvam: Song promo release in Nagadari from Virataparvam ..  Impressive video .. | Nagadarilo song promo released from rana daggubati  and sai pallavi movie virata parvam - filmyzoo - Hindisip

 ఈ చిత్రం జూన్‌ 17న విడుదల కాబోతుంది.ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో వేగం పెంచేసింది చిత్ర యూనిట్‌. అందులో భాగంగా తాజాగా ఈ చిత్రం నుంచి ‘నగాదారిలో..’పాటను విడుదల చేశారు. ‘

Sai Pallavi and Rana Daggubati's 'Virata Parvam' release postponed | The  News Minute

‘నిప్పు ఉంది, నీరు ఉంది నగాదారిలో..చివరికి నెగ్గేదేది, తగ్గేదేది నగాదారిలో..’అంటూ సాగే ఈ పాటకు దేవెర నరేందర్ రెడ్డి, సనపతి భరద్వాజ్ పాత్రుడు లిరిక్స్‌ అందించగా.. వరంగల్ లోని వీరువాడకి చెందిన ఫోక్‌ సింగర్‌ వరం అద్భుతంగా ఆలపించారు. సురేశ్‌ బొబ్బిలి సంగీతం అందించాడు.. ఈ పాటలో విజువల్స్ హార్ట్ టచింగ్ గా ఉన్నాయి.

Virata Parvam: Virataparvam after Bhimlanayak .. Rana movie will be  released then .. | Will Rana sai pallavi virata parvam movie release after  Bheemla nayak movie? | The PiPa News

ఈ సినిమాలో మావోయిస్టు పాత్రలో రానా కనిపించనున్నారు. ఆయన్ను ప్రేమించే అమ్మాయి పాత్రలో సాయి పల్లవి నటించారు. సాయుధ పోరాటంతో పాటు హీరో హీరోయిన్ల మధ్య ఉన్న ప్రేమ కథను ఈ పాటలో అద్భుతంగా చూపించారు.

Rana, Sai Pallavi's 'Virata Parvam' gets a theatrical release date - The  Hindu

ఒక తిరుగుబాటు దారుడు ప్రేమలో పడిన తర్వాత కొత్త ప్రయాణంలో తాను నమ్ముకున్న సిద్ధాంతాలకు పూర్తి భిన్నంగా ఎలా మారాడు అనేది ఈ పాట ద్వారా తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రియమణి, నందిత దాస్‌, నవీన్‌ చంద్రలు ముఖ్య పాత్రలు పోషించారు. ద‌గ్గుబాటి సురేశ్ బాబు సమర్పణలో శ్రీల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌రా సినిమాస్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మించాడు.

Related posts