telugu navyamedia
క్రైమ్ వార్తలు

పోలీసులపై దౌర్జన్యం..ఎంఐఎం కార్పోరేటర్ గౌసుద్దీన్ అరెస్ట్..

హైదరాబాద్​లో పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన భోలక్‌పూర్ కార్పోరేటర్ గౌసుద్దీన్ ను పోలీసులు బుధవారం నాడు అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం భోలక్ పూర్ లో సోమవారం అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో దుకాణాలు మూసి వేయాలని పోలీసులు కోరారు.

రంజాన్ సందర్భంగా తెరుచుకున్నామంటూ దుకాణాదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన కార్పొరేటర్ గౌసుద్దీన్.. పోలీసులపై దుర్భాషలాడారు. వాళ్లపైకి దూసుకెళ్లి దౌర్జన్యం చేశారు. దుకాణాలు మూసేదిలేదని వారితో వాగ్వాదానికి దిగారు.

Unruly, abusive MIM Corporator booked - Great Telangaana | English

మరోవైపు గౌస్ ఉద్దీన్ పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన మంత్రి కేటీఆర్ గౌస్ ఉద్దీన్‌పై ట్విటర్ వేదికగా సీరియస్ అయ్యారు. ఇలాంటి వ్యక్తులను వెంటనే చర్యలు తీసుకోవాలని సదరు వీడియోను షేర్ చేస్తూ డీజీపీకి ట్వీట్​ చేశారు.

డ్యూటీలో ఉన్న పోలీసు అధికారులను అడ్డుకున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. తెలంగాణలో ఇలాంటి మూర్ఖత్వాలను సహించవద్దని.. రాజకీయాలకు అతీతంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీని అభ్యర్థిస్తున్నా’’ అని కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Thumbnail image

మంత్రి ఆదేశం మేరకు పోలీసులు కార్పొరేటర్ గౌసుద్దీన్‌ను బుధవారంనాడు అరెస్ట్ చేశారు.  అతనిపై 350, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చినట్టుగా చిక్కడపల్లి ఏసీపీ శ్రీధర్  తెలిపారు..

Related posts