హైదరాబాద్‌లోని మాదాపూర్ ఉన్న దుర్గం చెరువుకు ఉన్న పేరు అందరికి తెలిసిందే. రాత్రి సమయంలోఅక్కడ అందాలు చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు అనే చెప్పాలి. నగరంలో ఇది కూడా ఓ టూరిస్ట్ స్పాట్‌గా అని అంటారు. అయితే ‘సరదా కోసం ప్రాణాలు తెగ్గించి రోడ్లపై విన్యాసాలు, డ్యాన్స్‌లు చేయకండి’ అంటూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది.
దుర్గం చెరువు ఫ్లై ఓవర్, అర్థరాత్రి 1గంట సమయంలో కొందరు యువకులు ఫ్లై ఓవర్‌పైకి చేరుకున్నారు. వారిలో ఓ వ్యక్తి తప్ప తాకి తూలుతూ .. ప్రమాదకంగా రోడ్డు దాటుతూ, డ్యాన్స్‌లు చేశాడు. ఆ సమయంలో ఫ్లై ఓవర్‌పై వచ్చిన వాహనాలకు ఇబ్బంది కలిగించాడు. దీంతో అక్కడే డ్యూటీలో ఉన్న పోలీసులు ఫ్లై ఓవర్‌పై నడవడం ప్రమాదకరమని మొరపెట్టుకున్నా పెడచెవిన పెట్టిన ఆ యువకుడు డ్యాన్స్ చేస్తూ మరింత ఓవర్ యాక్షన్ చేశాడు. ఏమనుకున్నాడేమో ఫుట్‌పాత్ పైకి జారుకున్నాడు