telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

కూతురిపై తండ్రి అత్యాచారం.. ఐదేళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమాన

New couples attack SR Nagar

నేటి సమాజంలో వావివరుసలు మంటగలుస్తున్నాయి. ఇష్టానుసారాంగా ప్రవర్తిస్తూ రక్తసంబంధాలను మరచిపోతున్నారు. కూతురు పై లైగింగిక వేధింపులకు పాల్పడ్డ ఓ తండ్రికి న్యాయమూర్తి ఐదేండ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5 వేల జరిమానా విధించారు. హైదరాబాద్ అల్వాల్ అంబేద్కర్‌నగర్‌కు చెందిన లింగం గౌడ్‌కు ఇద్దరు సంతానం. ఒక కూతురు, ఒక కుమారుడు. 2014లో అనారోగ్య కారణాల వల్ల భార్య మృతి చెందింది.

ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తున్న లింగం గౌడ్ ఒంటిరిగా ఉన్న సమయంలో కూతురిని లైంగికంగా వేధించాడు. నెల రోజులకు పైగా కూతురిపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. కూతురు తమ సమీప బంధువుల ఇంటికి వెళ్లిన సమయంలో తండ్రి చేస్తున్న ఆకృత్యాలను తెలిపింది. బంధువుల ఫిర్యాదు మేరకు అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ నిమిత్తం కోర్టులో హాజరుపరిచారు. నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించినట్లు న్యాయవాది తెలిపారు.

Related posts