telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలంగాణ ప్ర‌భుత్వం మహిళా గవర్నర్‌ను అవమానిస్తున్నారు..

*సీఎం మోదీతో తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై భేటి
*తెలంగాణ‌లో ఏం జ‌ర‌గుతుందో అంద‌రికీ తెలుసు..

*ప్ర‌ధాని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు..
*ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి గ‌వ‌ర్న‌ర్ ఫ్రొటోకాల్ తెలియ‌దా?
*రాజ్యాంగాన్ని, రాజ్‌భ‌వ‌న్‌ని గౌర‌వించాలి.
*గ‌వ‌ర్న‌ర్‌కు గౌర‌వం ఇవ్వ‌క‌పోవ‌డానికి ప్ర‌జ‌ల‌కే వ‌దిలేస్తున్నాం..
*సీఎం కావాల‌నుకుంటే ఎప్పుడైనా నా ఆఫీస్‌కి రావోచ్చు..

రాజ్యాంగాన్ని, రాజ్‌భ‌వ‌న్‌ని గౌర‌వించాలి అని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. .ప్రధాని న‌రేంద్ర‌మోదీతో తెలంగాణ గవర్నర్ తమిళిసై బుధవారం నాడు న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. ఆనంత‌రం గ‌వ‌ర్న‌ర్ మీడియాతో మాట్లాడుతూ తాను తెలంగాణ ప్ర‌భుత్వంపై ఫిర్యాదులు చేయ‌డానికిరాలేదు.. ఒక డాక్టర్‌గా దేశంలో వ్యాక్సినేష‌న్ డ్రైవ్‌పై మాట్లాడేందుకు వ‌చ్చా అంటూ చెప్పుకొచ్చారు. పుదుచ్చేరి-తెలంగాణ మధ్య నేరుగా విమాన సర్వీసులు నడపాలని కోరాను అని తెలిపారు

తెలంగాణ‌లో ఏం జ‌ర‌గుతుందో అంద‌రికీ తెలుసు.. ప్ర‌ధాని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు.. ఆమె అభిప్రాయపడ్డారు. తెలంగాణ‌లో నేను అధికారం చ‌లాయించ‌డం లేదని..నేను ఫ్రెండ్లీ గ‌వ‌ర్న‌ర్‌ని అన్నారు. 

కౌశిక్ రెడ్డి అభ్యర్ధిత్వాన్ని తిరస్కరించినట్టుగా ఆమె చెప్పారు. కౌశిక్ రెడ్డి అర్హతలు సరిపోలేదన్నారు. అందుకే ఆయన అభ్యర్ధిత్వాన్ని తిరస్కరించినట్టుగా ఆమె గుర్తు చేశారు. ఈ విషయంలో ఎలాంటి రాజకీయం లేదని ఆమె స్పష్టం చేశారు.

అంతకుముందు ఇద్దరు ఎమ్మెల్సీలకు ఆమోదముద్ర వేశానని గుర్తు చేశారు. ఎల్లప్పుడూ తాను రాజ్యంగ విలువలకు ప్రాధాన్యం ఇచ్చేలా వ్యవహరించానని, గవర్నర్ పదవికి, రాజ్ భవన్‌కు మచ్చ తెచ్చేలా ప్రవర్తించలేదని అన్నారు. నేను రాజ్యాంగబద్ధంగానే నడుచుకుంటా అని అన్నారు.

తెలంగాణ ప్ర‌భుత్వం మహిళా గవర్నర్‌ను అవమానిస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గవర్నర్‌ ప్రోటోకాల్‌ తెలియదా..?. గవర్నర్‌కు గౌరవం ఇవ్వకపోవడాన్ని ప్రజలకే వదిలేస్తున్నాను అన్నారు.. 

వ్యక్తిని కాకుండా వ్యవస్థను పరిగణనలోకి తీసుకోవాల‌ని అన్నారు. న‌న్నుఎవరూ అవమానించలేదని…తనకు ఎలాంటి ఈగోలు లేవని వెల్లడించారు. ఉగాది సంబరాలకు కూడా సీఎం కేసీఆర్ కు ఆహ్వానం పంపినట్టుగా చెప్పారు.

తాను లేవనెత్తిన అంశాలపై ఏమైనా ఇబ్బందులుంటే సీఎం కానీ, మంత్రులు కానీ ఎప్పుడైనా తన ఆఫీస్ కు వచ్చి మాట్లాడొచ్చు కదా అని ఆమె ప్రశ్నించారు.

Related posts