telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

బంగారం అక్రమరవాణాలో కొత్త కోణాలు.. మలద్వారంలో పెట్టుకొని..

gold smuggling caught in airport

బంగారాన్ని అక్రమంగా రవాణా కాకుండా చూడడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. అదే తరహాలో సరికొత్త మార్గాలు కనుక్కుంటున్నారు రవాణా దారులు. తాజాగా శంషాబాద్‌ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన షేక్‌ ఫయాజ్‌ అహ్మద్‌ దుబాయ్‌ నుంచి ఎయిర్‌లైన్స్‌ 6ఈ-026 విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరాడు. ఈ క్రమంలో 667 గ్రాముల బంగారాన్ని కరిగించి పేస్టులా మార్చాడు. 6 గొట్టాలు తయారు చేసి అందులో బంగారాన్ని నింపాడు.

భద్రతా సిబ్బంది కళ్లుగప్పేందుకు తన మలద్వారంలో పెట్టుకున్నాడు. శంషాబాద్‌లో దిగగానే అతని నడవడికపై అనుమానం కలిగిన అధికారులు అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ క్రమంలో అక్రమంగా బంగారం తరలిస్తున్న విషయం బయటపడింది. ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు దాని విలువ రూ.25.68లక్షలు ఉంటుందని తేల్చారు. దీంతో పాటు ఎలాంటి ధ్రువపత్రాలు లేని రూ.1.81లక్షల విలువైన చరవాణులు, బుర్కాలు స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts