telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

బెంగళూరులో ఇన్ఫోసిస్ ఉద్యోగుల అరెస్ట్

shareholders firm ready to take action on infosys

ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ లో పని చేస్తున్న ముగ్గురు ఉద్యోగులను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. . ఆదాయపు పన్ను శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు వీరిపై కేసు నమోదైంది. ట్యాక్స్ రిబేట్లు ఇప్పిస్తామంటూ ఐటీ చెల్లించే వారిని సంప్రదించి, ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారన్న ఆరోపణలతో కేసు నమోదు చేశారు.

ఈ సందర్భంగా పోలీసు అధికారి మీడియాతో మాట్లాడుతూ, చెల్లించాల్సిన ఆదాయపు పన్ను మొత్తంలో 4 శాతం రిబేట్ ఇప్పిస్తామని వీరు ముగ్గురూ ట్యాక్స్ చెల్లించేవారిని సంప్రదించారని చెప్పారు. వీరిని రేణుగుంట కల్యాణ్ కుమార్, ప్రకాశ్, దేవేశ్వర్ రెడ్డిలుగా గుర్తించామని తెలిపారు. స్థానిక కోర్టు వీరిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించిందని చెప్పారు. వీరికి వచ్చిన సమాచారాన్ని వెంటనే ఆదాయపు పన్ను శాఖలో పని చేస్తున్న కొందరు ఉద్యోగులకు ఫార్వర్డ్ చేసేవారని వెల్లడించారు.

Related posts